ఆలుగడ్డలో చేరే ఆహార పదార్ధాల చిట్టా పెద్దదే. వంద గ్రాముల బంగాళ దుంపలో 77 కిలోల క్యాలరీలు, కార్బో హైడ్రేట్స్ 17.4 గ్రాములు, కొవ్వు 0.1 గ్రామ్, ప్రోటీన్లు, విటమిన్ సీ, విటమిన్ కే, నియాసిన్ ,క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం,పోటాషియం వంటి పోషకాలుంటాయి. మనకు దోరికేవి మట్టి రంగులో గుండ్రంగా కొడుగుడ్డు లా ఉండేవి. కాని ప్రపంచం మొత్తం మీద నాలుగు వేల రకాల ఆలుగడ్డలున్నాయి. రోజ్ రెడ్, పర్పుల్, పెరూవియన్, ఆల్ రెడ్ పొటాటో, కింగ్ ఎడ్వార్డ్, హైల్యాండ్ బర్గండీ బ్లు బెల్లె, జెస్టర్ పెద్ద ముత్యమంత ఉండే పెరల్ పొటాతో,బేబి పొటాటో, తైనీ పొటాటో, రష్యన్ బనానా వంటి బోలెడు రకాలున్నాయి. వీటీ శక్తి అమోఘం. వృద్దాప్య లక్షణాలు రానివ్వకుండా మెదడు చురుగ్గా ఉండేందుకు బంగాళాదుంపలు ఉడకబెట్టి రకరకాల రుచులలో తింటే ఆరోగ్యం.
Categories