ఉద్యోగినులకు మాములు రోజుల్లో శిరోజాల విషయంలో శ్రద్ధ తీసుకొనే సమయం దొరకదు .ఈ లాక్ డౌన్ సమయం లో జుట్టు పై కాస్త శ్రద్ధ పెట్టే తరుణం .కొబ్బరి నూనెలో ఆముదం కలిపి తలకు పట్టించాలి .రాత్రంతా అలా ఉంచి మరుసటి రోజు తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది .అలాగే అర టీ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ , ఇంకో స్పూన్ కొబ్బరి నూనె తో కలిపి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నామం చేయాలి .చెంచా కలబంద గుజ్జు లో కొద్దిగా బాదం నూనె కలిపి తలకు పట్టించి, ఓ అరగంట తర్వాత తలస్నామం చేయాలి .అలాగే మంచి ఆహారం కూడా జుట్టు పెరుగు దలకు సాయం చేస్తుంది .జింక్, ఐరన్ ,పోలిక యాసిడ్ విటమిన్ ఎ- సి- సి-ఇ ఇవన్నీ ఉండే ఆహారం ప్రతిరోజు తీసుకోవాలి .

Leave a comment