శారీరక ఆరోగ్యాన్ని దృఢత్వాన్ని ఇచ్చే బీట్ రూట్ ను తరచూ తీసుకోమంటున్నారు ఆహార నిపుణులు. మహిళల్లో కనిపించే పోషకాహార లోపం త్వరగా అలసిపోవటం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలకు బీట్ రూట్ ఔషధం. బీట్ రూట్ లోని ఐరన్, జింక్, కాపర్ అమ్మాయిలకు మంచి పోషకాలు నెలసరి సమయంలో అధిక శక్తిని ఇస్తుంది మెదడు తో సహా శరీర భాగాలకు రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది. ఇందు లోని పొటాషియం జుట్టు కుదుళ్లు బలంగా ఉంచుతుంది. శరీరానికి పుష్టి ఇచ్చి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అందుకే క్రీడాకారులు బీట్ రూట్ రసం తప్పకుండా తీసుకుంటారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపులు నుంచి ఉపశమనం ఇస్తాయి.

Leave a comment