చెవులకు, ముక్కులకు, చేతులకు, నడుముకు పాదాల వేళ్ళకు వేసుకునే నగల విషయంలో ఎన్నో వైజ్ణానికి విశేషాలు ఉన్నాయంటున్నారు. ఉదాహరణకు చెవులు కుట్టించుకోవడం అనేది ఆక్యుపంచర్ వైద్య విధానానికి సంభందించింది. సంప్రదాయం వెనుక విజ్ణానం దాక్కుని ఉంది. చెవులు కుడితే రుతు సంభందమైన ఆరోగ్య సమస్యలు రావు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. నాడీ మండలం ఉత్తేజితమై నాడులు ప్రేరణ చెందుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. ఇన్ని విశేషాలు ఉండబట్టే ప్రాచీన కాలంలో మగవాళ్ళకు కూడా చెవులు కుట్టేవాళ్ళు. రాజుల బొమ్మల్లో చెవులకు బరువైన నగలు కనిపిస్తాయి. ఫ్యాషన్ కోసం కాకుండ ఆరోగ్య శాస్త్ర రిత్య ఎన్నో ప్రయోజనాలుంటాయి. కనుకనే పిల్లలకు చెవులు కుట్టించిన పర్లేదు అంటున్నారు ఎక్సెపర్ట్ష్స్.
Categories