Categories
Wahrevaa

రాత్రి వేళ తాగితే మరింత ప్రయోజనం.

వందల సంవత్సరాల నుంచి పాలు డైట్ లో భాగంగా ఉంటున్నాయి. పుష్కలంగా విటమిన్స్ మినరల్స్ నిండి వున్న పాలు మంచి ఆరోగ్యానికి ఆధారం పాలు పూర్తి ఆహారం కుడా ఉదయాన్నే తాగే పాలు రోజంతటికీ శక్తి ఇవ్వడమే కాకుండా మజిల్స్ బలంగా వుండేందుకు శరీరానికి కావలిసిన కాల్షియం ఇచ్చేందుకు ఉపయోగ పడతాయి. ఈ పాలు రాత్రి వేళ తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయి. గ్రామ పాలల్లో టీ స్పూన్ తేనె అరస్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి కొద్ది చుక్కల నెయ్యి వేసుకుని క్రమం తప్పకుండా తాగితే మంచి నిద్ర, రక్త పోటు నియంత్రణలో వుండటం కొలెస్ట్రోల్ తగ్గడం తో పాటు జీర్ణకోశ సమస్యలు పూర్తిగా పోతాయి. ఈ పాలు యాంటి ఫంగల్, యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలు వుంది రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇన్సులిన్ స్ధాయి క్రమబద్దమై జీవక్రియల పనితీరు మెరుగవ్వుతుంది.

Leave a comment