అదిరేటి డ్రెస్సు మేమేస్తే…… అని పాత సినిమా పాట పాడుకుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా వుంటే బోరేస్తుంది కూడా. వున్న పాత దాన్నే కొత్తగా చూడాలి, చూపించాలి. డెనిమ్ ప్యాంట్లు ఎప్పుడూ ఒకే రకంగా ఫ్యాషన్ ఐకాన్ గా ఉంటాయి. అవి వేసుకోవాలి అంటే విసుగ్గా వుండదు. చాలా నలుపుగా వాటికి కొత్త హంగులు తెచ్చారు. రకరకాల రంగులద్దేసి రకరకాల మోడల్స్ తో తీర్చి దిద్దే న్యూ లుక్ తో వాటిని చూపించారు. ప్యాంటు పైన అచ స్టాక్ట్ పెయింట్ గా రకరకాల రంగులద్దేసి ప్యాంట్ మొత్తం అడవి అందాల్ని తెచ్చి పెట్టేసి, మంచి మంచి పైంట్లు డిజైన్లు గీసి, రంగ వల్లులు గీసేసి మొత్తానికి కాజువల్ గా కనిపించే వీటిని ఫ్యాషన్ మోడల్స్ పక్కన నిలబెట్టెసారు. ఇప్పుడు ప్యాంట్ పైన పెయింట్ ఒక స్పెషల్ అందం, సాదా సీదా ప్యాంట్ అదిరిపోయింది.

Leave a comment