కోవిడ్ లాక్ డౌన్ లో ఇల్లు గడవక రోడ్డు పైన కర్రసాము చేస్తూ యాచిస్తూ కనబడిన శాంతా బాలు పవార్ సోషల్ మీడియా లో ఎందరో నెటిజన్ల అభిమానం సంపాదించింది. ఆమె వివరాలు తెలియజేస్తే ఆమెచేత ఆడపిల్లలకు ఆత్మరక్షణ శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తాను.అని సోనూ సూద్ ట్వీట్ చేశారు.అన్నట్లు గానే పూణేలో శాంతా పవార్ మమ్మ చేత స్కూల్ పెట్టించాడు. ఇప్పుడామె స్కూల్లో ఆడపిల్లలకు శిక్షణ ఇస్తోంది. కర్రసాము లో శిక్షణ ఇస్తోంది శాంతా పవార్ వీడియో చూసి ముంబై వాసులు చాలా మంది ఆమెకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.జూలై నెలలో మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్థానిక ఎమ్మెల్యే చేతన్ తోపేలు స్వయంగా శాంతా పవర్ సొంత ఊరు హడప్ సర్ లోని ఆమె ఇంటికి వెళ్లి చీరె సారె తో పాటు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.

Leave a comment