ఈ కరోనా వైరస్ విజృంభించిన రోజుల్లో తీసుకొనే ఆహారం రోగ నిరోధక శక్తిని పెంచేదిగా ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. తులసి టీ తాగితే ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని దగ్గు జలుబులు దగ్గరకు రానివ్వదు అని చెపుతున్నారు వైద్యులు .అలాగే హానికరమైన సూక్ష్మ జీవులతో పోరాడ గలుగుతుంది. కప్పున్నర నీటిలో పావు కప్పు తులిసి ఆకులు వేసి చిన్నమంటపై మరిగించాలి ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో స్పూన్ తేనె, రెండు స్పూన్ లు నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఈ టీ తాగితే ఒత్తిడి ఆందోళన తగ్గిపోతాయి. గొంతు సమస్యలు రావు.

Leave a comment