Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Gagana

3614 Articles
నిను చూడక నేనుండలేను తో మొదలు పెట్టి, నాగ, ఒక్కడు, విజయం, సింహాద్రి, 7/G బృందావనం కాలనీ వంటి ఎన్నో సినిమాల్లో శ్రేయా ఘోషల్ పాడిన అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకులు వున్నారు. తన గానం తో భారతీయులకు వీనల విందు చేసిన శ్రేయ కు అరుదైన గౌరవం దక్కనుంది. మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీలో నెలకొల్పనున్న మ్యుజియంలో ఆమె మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తోలి సింగర్ కూడా శ్రేయా ఘోషలే. గీతా లావన స్టైల్ లో ఆమె విగ్రహాన్ని తాయారు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. 2002 లో పడటం మొదలు పెట్టిన 15 సంవత్సరాలుగా ఎన్నో పాటలు పాడారు. ఈ మ్యుజియం లో ప్రధాని మోడీ తో పాటు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లతో పాటు ఇతర ప్రముఖుల విగ్రహాలు కూడా పెడతారు.
Categories
Gagana

ఢిల్లీ టుస్సాడ్స్ లో శ్రేయా ఘోషల్ విగ్రహం

March 17, 2017
1 min read
నిను చూడక నేనుండలేను తో మొదలు పెట్టి, నాగ, ఒక్కడు, విజయం, సింహాద్రి,…
Read more
సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రత్యేకమైన నటిగా స్థాయి నిరూపించుకుంది శ్రీదేవి. తమిళ చిత్రం పులి లో మహారాణిగా రిచ్ లుక్ లో మళ్ళి శ్రీదేవి అందంగా మెరిసిపాయింది. ఫిప్టీ ప్లస్ లోనూ ఆమె తిరుగు లేని అందం తో స్టున్నింగ్ పర్ఫోమెన్స్ తో ఇప్పుడు 'మామ్' గా టైటిల్ రోల్ లో ప్రేక్షకులకు తన గ్లమమౌర్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రీదేవి. ట్విట్టర్ లో మామ్ ఫస్ట్ లుక్ పోస్ట్ చేసి 'ఒక స్త్రీకి సవాలు ఎదుర్కునేటప్పుడు మామ్ పోస్టర్ ను అవిష్కరిస్తున్నా' అని పోస్ట్ పెట్టింది. నీలి రంగు దుస్తుల్లో సీరియస్గా చూస్తునట్లు పోస్టర్ లో వివిధ భాషల్లో అమ్మను ఏమంటారో రాసి వుంది తన సవతి కుమార్తె కు న్యాయం చేయడానికి మామ్ ఏంచేసింది. అన్న కధంసం తో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీ దేవి భర్త భోనికపూర్ నిర్మిస్తున్నారు. అదే దేశానికి చెందిన బాలనటి సాజల్ అలీ కూతురిగా చేస్తుంది.
Categories
Gagana

మామ్ సినిమాలో మళ్ళి శ్రీ దేవి

March 16, 2017
1 min read
సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు…
Read more
సెల్ఫీ సరదా వరకే వుంచుకుంటే పర్లేదు, అది ఇతరుల గౌరవానికి భంగం వచ్చేలా వుంటే మాత్రం సమస్యే. ఈ మధ్య కాలంలో విద్యాబాలన్ బీగమ్ జాన్ సినిమా పని గురించి నిర్మాత ముకేష్ భచ, దర్శకుడు శ్రాజిల్ ముఖర్జీ తో పాటు, కలకత్తా ఎయిర్ పోర్టు నడుస్తూ వస్తుంది. ఒక్క వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ఫీ తిసుకొబోయాడు. విధ్యాబాలన్ సరేనంది. అతను చొరవగా ఆమె భుజం పైన చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోబోయాడు. అతని చెయ్యి అసభ్యంగా తన విపు పైన కదులుతుంటే విద్య షాక్ తిని చేయి తిసేయమంది. ఆటను విననట్లే చేయి తీయకుండా సెల్ఫీ తిస్తునట్లే వున్నాడు. విద్య సహనం పోయి ఏమనుకుంటున్నావ్, నువ్వేం చేస్తున్నావో తెలుసా, ఇది తప్పు అని కేకలు పెట్టింది. అతని ప్రవర్తన తనను ఎంతో బాధ పెట్టిందని ఒక అపరిచుతుడు చొరవగా చెయ్యి వేస్తె ఎలా వుంటుంది. మేం పబ్లిక్ ఫిగార్లమే కానీ, పుబ్లిక్ ప్రోపర్టి కాదు అని చాలా బాధ పాడింది విద్యా. అభిమానం వుంటే సంతోషం, అరాదించినా సంతోషమే, కానీ అవమానించడం ఎంత వరకు సభ్యత? విద్యాబాలన్ కష్టపెట్టుకున్నట్లు ఆడవాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా?
Categories
Gagana

మేం పబ్లిక్ ప్రోపర్టిలు కాదు

March 15, 2017
0 mins read
సెల్ఫీ సరదా వరకే వుంచుకుంటే పర్లేదు, అది ఇతరుల గౌరవానికి భంగం వచ్చేలా…
Read more
అంకితా కుమారి, పదో తరగతి పరీక్ష రాస్తోంది. ఏముంది? ఎంతో మంది రాస్తున్నారు అనొచ్చు. కానీ అంకిత పరీక్ష రాస్తుంది కాలి బొటన వేళ్ళ మధ్య పెన్ను తో, అంటే కాలి తో రాస్తోంది పరీక్ష బీహార్ లోని నరన జిల్లాకి చెందిన బనియా పూర్ జిల్లాలోని పదో తరగతి అమ్మాయి అంకితా కుమారి.ఐదేళ్ళ వయస్సులో పోలియో వచ్చింది. చేతులు చచ్చుపడి పోయాయి. మాటలు సరిగ్గా రావు. ఇప్పుడు ఆ పాప అమ్మమ్మ తోడుగా పరీక్ష సెంటర్ కి వస్తుంది. కార్పెట్ పైన కూర్చొని పరిక్షలు రాస్తోంది. ఆమెకి ఎంతో మానసిక ధైర్యం వుంది. తప్పకుండా మంచి జాబ్ సంపాదించే ప్రతిభ వుంది అంటున్నారు ఆమె క్లాస్ టీచర్లు. జీవితం ఏదిచ్చినా సరే దాన్ని మనసారా స్వీకరించి దాన్ని గెలవాలనే అంకిత ఇవ్వాల సోషల్ మీడియా అభినందనలు పొందుతుంది.
Categories
Gagana

అద్భుతమైన గొప్ప కధ అంకితా కుమారి.

March 14, 2017
0 mins read
అంకితా కుమారి, పదో తరగతి పరీక్ష రాస్తోంది. ఏముంది? ఎంతో మంది రాస్తున్నారు…
Read more
లక్షల విలువైన అందమైన నగలను ఆమె తాయారు చేస్తుంది. ఆమె తాయారు చేసిన నగలకు బ్రిటన్ లోనే కాదు దేశ విదేశాల్లో మంచి డైమెండ్ వుంది. చాలా మంది డిజైనర్లు వుండగా అన్నెట్టి గబేడే గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఆమె చేతులకు వెళ్ళే లేవు.ఈ వైకల్యం ఆమె లోని సృజనకు అడ్డకట్ట వేయలేక పోయింది. వెడ్డింగ్ రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్స్. సిల్వర్, గోల్డ్, డైమెండ్స్, ఎమరాల్డ్స్ వంటి ఎంతో ఖరీదైన స్టోన్స్ ఉపయోగించి ఆమె అద్భుత సృష్టి చేస్తుంది. నెక్లెస్ లు, ఇయర్ రింగ్స్, బ్రేస్ లెట్స్, బాంగిల్స్, బ్రూచ్ లు, కఫ్ లింక్స్ ఆమె ప్రత్యేకతే అనొచ్చు. చేతులకు వెళ్ళు లేకుండా ఇవన్నీ ఎలా సాధ్యం అంటే, పట్టుదలతో ఇలా వున్నాను కనుక నాకిది లోపం అనిపించదు. వేళ్ళు లేకపోయినా నాపనులు చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత డిజైనర్ గా నగల్ని తాయారు చేయడం నాకు కష్టం అనిపించ లేదు అంటుంది అన్నెట్టి.
Categories
Gagana

ఈ అద్భుత సృజన ఎలా సాధ్యం

March 9, 2017March 9, 2017
0 mins read
లక్షల విలువైన అందమైన నగలను ఆమె తాయారు చేస్తుంది. ఆమె తాయారు చేసిన…
Read more
2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు లేని ప్రతిభ చూపించారు. కిరణ్ మంజుదాస్ షా, ఫోబ్స్ ప్రకటించిన 2016 జాబితా లో ఈమె పేరు శక్తి వంతమైన మహిళల జాబితాలో వుంది. బయోకాన్ స్థాపించి నాదిపిస్తున్నారు కిరణ్ మంజు దాస్. డయాబెటిక్ రోగాలుని ప్రణాలు కాపాడే ఇన్సులిన్ ని తాయారు చేసే అతి పెద్ద కంపనీ అమెది. బయోకాన్ పరిశోధన విభాగం నుంచి 950 పేటెంట్స్ కి వెళ్ళారంటే ఆ పరిశ్రమ ఎంత గొప్ప స్థానం లో వుందో తేలింది. దేశ ఆరోగ్యం పెంపొందించడంలో తన వంతు కర్తవ్యం నిర్వహించిన కిరణ్ స్ఫూర్తి నిచ్చే మహిళల్లో ముందుంటారు.
Categories
Gagana

దేశ ఆరోగ్యం కోసం బయోకాన్

March 8, 2017
0 mins read
2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు…
Read more
ట్రాక్టర్స్ రాణి అంటారు మల్లికా శ్రీనివాసన్ ను . సాంప్రదాయ తమిళ కుటుంబంలో పుట్టిన మల్లికా టాఫే పరిశ్రమ చైర్ పర్సన్ గా , సిఇఓ గా వ్యవరహిస్తూ దాన్ని లాభాల బాట లో నడిపిస్తున్నారు. అమెరికాలోని విజిసిఓ సంస్థ బోర్డులో ఆమె సభ్యురాలు. టాటాస్టీల్ , టాటా గ్లోబల్ బెవరేజస్ లో మల్లికా డైరెక్టర్. అమెరికాలో బిజినెస్ స్కూల్ లో ఎం.బి.ఏ చేసిన మల్లిక పర్యవేక్షణ లో టుఫే అంటే ట్రాక్టర్ అండ్ ఫర్మా ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఇప్పుడు లక్షకు పైగా ట్రాక్టర్లు తయారు చేస్తుంది. పద్మశ్రీ అవార్డు గ్రహిత. ఫస్ట్ బిజినెస్ విమెన్ అవార్డుని బిబిసి నుంచి అందుకొన్న ఆమె 2016 ప్రపంచ ప్రభావిత మహిళ అయ్యారు. ఆమె అందుకొని అవార్డులు లేవు. సామాజిక సేవలో భాగంగా శంకర్ నేత్రలయం మద్రాస్ కాన్సర్ ఇన్ స్టిట్యుట్ కి అండగా నిలబడుతుంది.
Categories
Gagana

ట్రాక్టర్స్ రాణి మల్లికా

March 8, 2017March 8, 2017
0 mins read
ట్రాక్టర్స్ రాణి  అంటారు  మల్లికా  శ్రీనివాసన్ ను . సాంప్రదాయ  తమిళ  కుటుంబంలో…
Read more
ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారాయణన్ పేరుని టైమ్స్ పత్రిక గుర్తించింది. స్వచ్చంధ సేవా సంస్థ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ల ను నడిపిస్తున్న పర్యావరణ వేత్త సునీతా నారాయణన్. బహుళ జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్ధాలు వున్నాయి అని లేబరేటరీ రిపోర్ట్స్ ద్వారా నిరూపించి కొక్, పెప్సీ, కోలా కంపెనీలకు హడలెత్తించారు సునీత. పండ్లు ముగ్గపెట్టడం లో వాడుతున్న రసాయినాలు నిషేదపు ఉత్పత్తులు ప్రభుత్వం ఇబ్బందన్నా, ఢిల్లీ విధుల్లో డిజిటల్ ఆటో లో వాహనాలు పోయి సి.ఎన్.జి వాడకం వచ్చిందన్న నీడలా దాని వెనక వున్నది సునీత జల కాలుష్యం వచ్చిందన్న, వాయు కాలుష్యం , కాలుష్య కారణాలు డాక్యుమెంటేషన్ చేస్తారు సునీత. పద్మశ్రీ అవార్డు తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థల అవార్డులు, ఎన్నో గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు సునీత.
Categories
Gagana

పర్యావరణ పరిరక్షణ లక్ష్యం.

March 8, 2017March 8, 2017
0 mins read
ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారియన్ పేరుని…
Read more
హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానికి ప్రోచాన్సులర్ కూడా వున్నారామే. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్. ఎండెవర్ ఇండియాకి ఆమె ప్రస్తుత చైర్మన్. ఆమె తండ్రి కె.కె బిర్లా తాత జి.జి బిర్లా, శక్తి వంతమైన వ్యాపార కుటుంబంలో పుట్టిన శోభన పత్రికా రంగంలో అతి చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏనాడో ఆమెను గ్లోబల్ లీడర్ ఆఫ్ టుమారో గా కీర్తించింది. ఔట్ స్టాండింగ్ బిజినెస్ విమెన్ అవార్డు, కార్పోరేటే ఎక్స్ లెన్స్ అవార్డు, జర్నలిజం రంగంలో పద్మశ్రీ , ఆమెను వరించాయి. మింట్ పత్రిక, ఫీవర్ 104, ఎఫ్ ఎమ్ రేడియో ఛానల్ ఆమె రూపం పోసినవే మీడియా రంగం లో తిరుగు లేని మహిళ శోభనా భార్తియా.
Categories
Gagana

మీడియాలో తిరుగులేని శోభనా

March 8, 2017March 8, 2017
0 mins read
హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్…
Read more
ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా ఆపైన ఏడేళ్ళ పాటు సిస్కో కి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేసారు. ‘నెక్ట్స్ఇవి’ అనే చైనా కు చెందిన ఎలక్ట్రికల్ కార్ల కంపనీకి అమెరికా విభాగంలో సి.ఇ.ఓ గా పద్మశ్రీ బాధ్యతలు తీసుకున్నారు. ఐ.టి రంగంలో తిరుగులేని రాణిగా పేరు పొందిన పద్మశ్రీ భూగోళం పైన మొబైల్ ఫోన్ గురించి ఆలోచించిన అత్యున్నత సంకేతిక నిపుణురాలు పద్మశ్రీ ఒకరని ఆమె కితాబులు అందుకున్నారు. స్వయం బోదిత వాహనాల రూప కల్పన, ఎలక్ట్రిక్ కారు రూపకల్పనలో ఆమె పోషించిన పాత్రకు ఫోబ్స్ మేగజైన్ ఆమెకు ఆమెకు క్వీన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్ బిజ్ అని పేర్కొన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహిళల జాబితాలో పద్మశ్రీ ఒక్కరు.
Categories
Gagana

ఐటీ లో తిరుగు లేని పద్మశ్రీవారియర్

March 8, 2017March 8, 2017
0 mins read
ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు.…
Read more
టీ.వి దర్శకురాలిగా, పప్రోడ్యుసర్ గా , నటిగా, రచయిత్రి గా నేహాసింగ్ ముంబాయి మహిళలకే స్పూర్తి. ముంబాయిలో అమ్మాయిల స్వేచ్చ కోసం, రండి, గుంపులుగా రండి, కలసి కట్టుగా ముంబాయి వీధుల్లో నడవండి. ఆకతాయిల గుండెల్లో రైళ్ళు పరిగేట్టిద్దాం రండి అంటూ పిలుపునిచ్చిన నేహాసింగ్ సంకల్ప బలం తో ఆకతాయిలను లొంగ దీద్దాం అంది. పురుషులు ఎంత స్వేచ్చగా విహరిస్తున్నారు నాకూ అంతే స్వేచ్చ కావాలి మహిళలకు మాత్రం తక్కువ స్వేచ్చ, ఆంక్షలు ఎందుకు. ఇది అంగీకారం కాదు అంటూ మొత్తం మహిళలంతా గళం విప్పేలా చేయగలిగిన ధిక్కార స్వరం నేహాసింగ్. ఈ ఉద్యమానికి ముంబాయి జోహార్ అంది. టీవి సీరియల్స్ షో స్ లో నేహాసింగ్ , సమర/ బిజ్లా అన్న పాత్ర ద్వారా అందరికి పరిచయం. స్టార్ ప్లస్ లో వచ్చిన ఫార్ద్ సీరీయల్ భూమిక పాత్రలో నటించిన నేహా ఇప్పుడు సంచలనం.
Categories
Gagana

ఒక ధిక్కారం నేహాసింగ్

March 8, 2017March 8, 2017
0 mins read
టీ.వి దర్శకురాలిగా, పప్రోడ్యుసర్ గా , నటిగా, రచయిత్రి గా నేహాసింగ్ ముంబాయి…
Read more
తిమక్కా అంటే ఎవ్వరూ గుర్తు పట్టారు ఏమో కానీ, సాలుమారద అంటే చెట్ల వరస తిమక్క అంటే మాత్రం కర్ణాటక అందరికి తెలుసు. అభివృద్ధి పేరు తో చెట్లు కులుస్తున్న ఈ రోజుల్లో మొక్కలే ప్రాణం అనుకుని 60 సంవత్సరాలుగా తన స్వగ్రామం హలికల్ కు వచ్చే దారిలో వరుస్సగా చెట్లు నాటి, వాటి సంరక్షణ చేసింది. ఇప్పుడవి పెద్ద వృక్షాలు. ఈమెది ఈ చెట్ల పరిరక్షణ చేసిననదుకు నేషనల్ సిటిజన్ అవార్డు ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం మొక్కలు నటించే కార్యక్రమానికి తిమక్క అని పేరు పెట్టారు. రహదారుల వెంట నీడ నిచ్చే చెట్లను పెంచడమే తిమక్క లక్ష్యం 20 వ ఏట పెళ్ళైన ఆమెకు 40 ఏళ్ళు వచ్చినా సంతానం లేరు. చుట్టూ పక్కల వాళ్ళు ఆమెను గొడ్రాలు అంటే చెరువులో దుకిందట తిమ్మక్క. ఒక్క చెట్టు ఆమె చేతికి దొరికి ఆమెను చవనివ్వలేదట. ఆ నాడు తనకు ప్రాణాలు కాపాడి సందేశం ఇచ్చిందని భావించి, మొక్కలు పెంచడం మొదలు పెట్టింది తిమక్క ఎంతో మంది తిమక్కలు పుట్టి ఈ భూగోలాన్ని పచ్చగా చేస్తే బాగుంటుంది.
Categories
Gagana

చెట్ల పరిరక్షణ చేసిన తిమక్క

March 8, 2017
0 mins read
తిమక్కా అంటే ఎవ్వరూ గుర్తు పట్టారు ఏమో కానీ, సాలుమారద అంటే చెట్ల…
Read more

Posts navigation

Previous 1 … 282 283 284 … 302 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.