Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని సాధించారామె. ఇలాంటి నాజూకు తనం కోసం ఎంతో కఠోర శ్రమ చేసింది సోనమ్. దశాబ్దం క్రితం సింగపూర్ లో ఆమె చదువుకునేటప్పుడు ఆమె బరువు 87 కిలోలు. ఎలాంటి ఆహార నియమాలు లేవు. సంజయ్ లీలా భన్సాలీ లో సావరియా సినిమాతో ఆమె ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టింది. ఆ ఛాలెంజ్ నిఅలవోకగా జయించి 32 కేజీల బరువు తగ్గిందామె. ఈ బరువు తగ్గే పనిలో సోనమ్ అనేక మంది ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఒక విభాగంలో ఒక ట్రైనర్. ఆమె మంచి కథక్ డాన్సర్. పుడుతూనే ఎవ్వరికీ మంచి సౌందర్యం ఆకృతి ఉండదు. ఎదిగే కొద్దీ శరీరాన్ని చక్కగా మలుచుకోవాలి. ఇప్పటి తారలు వాళ్ళు రెడ్ కార్పెట్స్ పైన నడవటం కోసం వెండి తెరపై మెరవటం కోసం ఎనెన్ని కష్టాలు పడ్డారు? ఎంత నోరు కట్టేసుకున్నారు?
Categories
Nemalika

అందం వెనక ఎంతో కధ వుంది

November 10, 2016November 10, 2016
0 mins read
ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు…
Read more
హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల రికార్డు సృష్టించారు. సియాటెల్ నుంచి 51 సంవత్సరాల ప్రమీల జయ్ పాల్ ప్రతినిధుల సభకు ఎంపికైనవారు. తొలి ప్రయత్నంలో ఈమె కాంగ్రెస్ కు ఎంపికయ్యారు. చెన్నయ్ లో జన్మించిన ప్రమీల కుటుంభం ఆమె ఐదేళ్ల వయసులో ఇండోనేషియా సింగపూర్ అక్కడనుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఈమె రాసిన ఫిలిగ్రిమేజ్ టు ఇండియా - ఏ ఉమెన్ రీ విజిట్స్ హోమ్ లాండ్ అన్న పుస్తకం 2000 లో ప్రచురితమైంది. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ప్రమీల అభిర్దితావన్ని బలపరిచారు.
Categories
First Women

ప్రమీలా జయ పాల్ విజయం

November 10, 2016November 10, 2016
1 min read
హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల…
Read more
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్ ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్ అమెరికా ప్రధమ మహిళ కానున్నారు. ఆమె జన్మతహా అమెరికన్ కాకపోవటంతో విదేశాల్లో పుట్టి ప్రధమ మహిళగా తొలిమహిళగా రెకార్డులెక్కనున్నారు. మాజీ మోడల్ అయినా 46 సంవత్సరాల మెలోనియా 1970 లో నాటి యుగోస్లోవేనియా లో జన్మించారు. 16 సంవత్సరాల వయసులో మోడలింగ్ లోకి వచ్చిన మెలోనియా స్లావేరియా , సెర్బియా ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ భాషలు మాట్లాడగలరు 2005 లో ఆమె ట్రంప్ ను పెళ్లి చేసుకున్నారు.
Categories
Top News

అమెరికా ప్రధమ మహిళ మెలోనియా

November 10, 2016November 10, 2016
0 mins read
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్  ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్  ఎన్నికవటంతో…
Read more
అమెరికాసాధారణ స్థాయి ఎన్నికల్లో నలుగురు భారతీయ సంతతి అమెరికన్లు విజయం సాధించారు. అందులో ఇద్దరు మహిళలు. 51 సంవత్సరాల భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అమెరికా సెనేట్ కు ఎంపికైన రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియాలో ని ఓక్ ల్యాండ్లో పుట్టిన హ్యారిస్ తల్లి చెన్నై నుంచి 1960 లో అమెరికా కు వలస వెళ్లారు. ఈమె తండ్రి జమైకన్. అమెరికా అధ్యక్షుడు ఒబామా కమలా హారిస్ ఆధ్వర్యంలోని బలపరిచారు.
Categories
Gagana

అమెరికా సెనేట్ కు కమలా హ్యారిస్

November 10, 2016November 10, 2016
0 mins read
అమెరికాసాధారణ స్థాయి ఎన్నికల్లో నలుగురు భారతీయ సంతతి అమెరికన్లు విజయం సాధించారు. అందులో…
Read more
తెలిసో తెలియకో బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేస్తుంటారు చాలా మంది ఆడవాళ్లు అడిగితే తీరిక లేదంటారు. కానీ ఉదయాన్నే చేయవలిసిన బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సుమారు 27 వేల మందిపైన సుదీర్ఘ కాలం పరిశోధనలు నిర్వహించారు. రెండు గ్రూపులుగా వీరిని విభజించి ఒక గ్రూపుకి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వకుండా రెండవ గ్రూపుకి ఇచ్చి కనీసం ఒక సంవత్సరం పరిశోధన చేస్తే అల్పాహారం తీసుకొనేవారు అధిక బరువు పెరిగినట్లు వారిలో ఒత్తిడి గమనించారని ఈ రెండు సమస్యలే గుండెకి సంబంధించిన ఎన్నో సమస్యలని తీరుస్తాయని పరిశోధకులు రిపోర్ట్ ఇచ్చారు ఉదయం తీసుకునే అల్పాహారానికి ,గుండె పని తీరుకీ మధ్య సంబంధం ఉందని వీరు కనిపెట్టారు. పొద్దుటే పనివేళ అని పది చేతులతో పని చేస్తున్నా తరగటం లేదని ఏ కాఫీ తోనో సరిపెట్టుకునే ఇల్లాళ్లకు ఇది హెచ్చరిక.
Categories
Wahrevaa

బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్

November 10, 2016November 10, 2016
0 mins read
తెలిసో తెలియకో బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేస్తుంటారు చాలా మంది ఆడవాళ్లు అడిగితే …
Read more
రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు క్లీన్సింగ్ మిల్క్ లేదా బేబీ ఆయిల్ ఉపయోగించి మురికి మేకప్ లను తొలగించుకోవాలి. ముఖం పైన పడే మచ్చలు ఫ్యాబీ గా మారటం పిగ్మెంటేషన్ వంటివి ప్రభావవంతంగా తొలగించుకోవటానికి విటమిన్ A ,C,E లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ క్రీమ్స్ వాడాలి. నిస్సారంగా మారటం ,నల్లబడటం, సూర్యరశ్మికి ఫోకస్ వాటం వంటివి నిరంతరం సన్ స్క్రీన్ తో అధిగమించవచ్చు. శిరోజాల తీరుకు సరిపోయే షాంపూను ఎంచుకుని కనీసం వారానికి మూడు సార్లైనా తలా స్నానం చేయాలి. మీరు హెయిర్ ఆయిల్ కండిషనర్లు వాడటం వల్ల జుట్టుకు చిక్కులు పడకుండా ఉంటుంది. ఊడే జుట్టు డెడ్ హెయిర్ గా గమనించుకోవాలి. వ్యాయామంతో శరీరాన్ని ఫిట్ నెస్ గా వుంచుకుంటేనే శరీరానికి చర్మానికి గ్లో వస్తుంది. ఇక హీల్తీ డైట్ టోన్ కాంతివంతమైన చర్మం శిరోజాలు సొంతమవుతాయి.
Categories
Soyagam

ఏ వయసులోనైనా అందంగా……. !

November 10, 2016
1 min read
రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య…
Read more
ఈ మధ్య కాలంలో అమెరికాకు నెయ్యి ఎగుమతులు ఎక్కువై పోయిందిట. మనం నెయ్యి అన్నం ,ఉప్పు ,గుడ్లు , చివరకు నీళ్ళు కూడా తగ్గించేసాము. పళ్ళ బిగువున నోరు కట్టేసుకుంటున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. అంటున్నారు నిపుణులు. నెయ్యి తగిన పాళ్ళలో వాడుకుంటే నష్టం లేదు. క్రీడా కారులు చురుగ్గా ఉండేందుకు శక్తి సోమ నెయ్యి ఉపయోగిస్తున్నారు. ఇందులోని మీడియం చెయిన్ ఫ్యాటీ ఆమ్లాలకు ఇతర కొవ్వులను కరిగించే శక్తి వుంది. అలాగే మనం కూరల్లో వేసుకునే ఉప్పు కన్నా ఇన్స్టెంట్ సూప్ లు, సొయా సాస్ , ఊరగాయల్లో వుండే ఉప్పే ఎక్కువ. అలాగే అన్నం మాంసాహారం కలిపి తినటం వల్ల కండర పుష్టికి కావలిసిన సంపూర్ణ పోషకాలు అందుతాయి. మధుమేహం ఉన్నవాళ్లు తప్పించి అన్నం నెయ్యి ఉప్పు మితంగా తినచ్చు. ముఖ్యంగా నెయ్యిలో బ్యుటైరిక్ యాసిడ్ వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. యాంటీ వైరల్ గుణాలు అధికం కూడా. నెయ్యిని మరీ తీసిపారేయకండి.
Categories
Wahrevaa

నెయ్యి వాడకం మంచిదే

November 10, 2016November 10, 2016
0 mins read
ఈ మధ్య కాలంలో అమెరికాకు నెయ్యి ఎగుమతులు ఎక్కువై పోయిందిట. మనం నెయ్యి…
Read more
కొన్ని మంచి పనులకు అన్నీ కలిసొస్తాయి. వివాహిత స్త్రీలు ముసుగు ధరించి సంప్రదాయం వుంది. అయితే మీర్జాపూర్ గ్రామానికి చెందినా అంజూ యాదవ్ ఈ సంప్రదాయం ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్నాయని ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని స్వానుభవం తో తెలుసుకుంది. ముసుగు ధరించనని పెద్దవాళ్ళ అనుమతి కోసం ఇంట్లోనే మూడేళ్లు పోరాడాల్సి వచ్చింది. ఆమె చెల్లి మంజూ యాదవ్ కూడా అక్కతో చేయి కలిపింది. వీళ్లకు పొరుగు గ్రామ సర్పంచ్ సజ్మా ఖాన్ తోడైంది. ధీజ్ గ్రామా సర్పంచ్ గా ఈ ముసుగు ఆమెకి ప్రాబ్లమే. ఈ ముగ్గురు కలిసి డిప్యుటీ కమిషనర్ ని కలిశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ముసుగుకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టి అవగాహనా కార్యక్రమాలు చేపట్టి దాదాపు 116 గ్రామాల మహిళలను చైతన్యవంతం చేసారు. ఈ మీర్జాపూర్ యువతులు ముసుగు పద్ధతికి శాశ్వతంగా చెక్ పెట్టేసారు.
Categories
Gagana

ముసుగుకు వ్యతిరేకంగా పోరాటం

November 9, 2016
0 mins read
కొన్ని మంచి పనులకు అన్నీ కలిసొస్తాయి. వివాహిత స్త్రీలు ముసుగు ధరించి సంప్రదాయం…
Read more
జీవితంలో ఎప్పుడూ సంతోషాలే వుండవు. ఎన్నో సవాళ్లు అనుభవాలు అనుభూతుల సంగమం జీవితం. సినీ నటి త్రిష ఈ మధ్య కాలంలో హండ్రెడ్ హ్యాపీ డేస్ ఛాలెంజ్ తీసుకుందిట. ఈ ఛాలెంజ్ కు వప్పుకునే వంద రోజుల పాటు ఎలాంటి విషయానికీ బాధ పడకుండా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి. ప్రతి ఒక్కరితో సంతోషాన్ని ఆత్మ విశ్వాసాన్ని సానుకూల దృక్పధాన్ని పెంచే దృష్టితో హండ్రెడ్ హ్యాపీ డేస్ సంస్థ ఈ పోటీ ని నిర్వహిస్తోంది. అందరితో ప్రేమగా ఉత్సాహంగా ఉండాలని తీర్మానించుకుని ఈ ఛాలెంజ్ తీసుకున్నా అన్నారు త్రిష. గతంలో ఈమె నో మేకప్ ఛాలెంజ్ తీసుకుని చాలా రోజులపాటు మేకప్ లేకుండానే బయట కార్యక్రమాల్లో పాల్గొన్నారట. ఇలాంటి ఛాలెంజ్ లు వప్పుకుంటే జీవితంలో నిరాశ అన్న పదం కాస్త దూరం జరుగుతుందేమో !
Categories
WhatsApp

వంద రోజులు సంతోషంగా ఉంటా

November 9, 2016
0 mins read
జీవితంలో ఎప్పుడూ సంతోషాలే  వుండవు. ఎన్నో సవాళ్లు అనుభవాలు అనుభూతుల సంగమం జీవితం.…
Read more
పిల్లల్ని సరదాగా ముద్దు పేర్లతో పిలుస్తాం. ఒక్కసారి ఆ ముద్దు పేర్లే అసలు పేర్లను డామినేట్ చేసి జీవితాంతం నిలబడిపోతాయి కూడా. మనందరికీ ఏవో ముద్దు పేర్లు వుండే ఉంటాయి.అలాగే మనం ఇష్టపడే సెలబ్రెటీస్ కూడా ముద్దు పేర్లున్నాయి. సమంతను ఏమాయచేసావే సిఎంమాలో నటించాక అందులో హీరోయిన్ పేరుతోనే జెస్సీ అని సామ్ అని పిలుస్తారట ఫ్రెండ్స్. హన్సిక కు తమిళ్ లో చిన్న ఖుష్భు అని పిలుస్తారు. అమలాపాల్ ని ఆమ్స్ ,ఆము , బ్రాట్ అని స్నేహితులంటారు. కాజల్ ని ఇంట్లో అందరూ కాజు అంటే త్రిష నయితే హానీ అంటారు. తమన్నా ని తమ్ము అనేస్తారు. ఇక అనుష్క అసలు పేరే స్వీటీ శెట్టి . తనను స్వీటీ అనే పిలుస్తారు. నయన తార ను కుటుంబ సభ్యులు మణీ అని స్నేహితులు నయన్ అని ఇలియానా ను ఇలూ అయింది. శ్రద్ధ దాస్ ని వాళ్ళ బామ్మ మాకడ్ అంటే కోతి ని ట్రిమ్ చేసి మాకూ అని పిలుస్తుందిట. సోనమ్ కపూర్ ని వాళ్ళ నాన్న జిరాఫీ అంటారట. ఐశ్వర్య రాయి ని ఇషూ , గోల్లు, ఐస్ అంటారట. కరీనా కపూర్ ని బెబో , ప్రియాంక చోప్రా ని మీమీ అంటారు. ఇంకెన్నో ఎందరో పేర్లు సరదాగా వినబడుతూనే ఉంటాయి.
Categories
WhatsApp

మీ ముద్దు పేరేమిటి

November 9, 2016
0 mins read
పిల్లల్ని సరదాగా ముద్దు పేర్లతో పిలుస్తాం. ఒక్కసారి ఆ ముద్దు పేర్లే అసలు…
Read more
అరటి ,సీతాఫలం, పనస ,సపోటా పై తోలు ఎలాగున్నా లోపల దాదాపు తెల్లగా గోధుమ రంగులతో ఉంటాయి కదా. కానీ ఇప్పుడు గజ్జి ప్రకాశవంతమైన రంగులో ఉంటే పోషకాలు పంట పండినట్లేనని లోపల మంచి రంగు ఉండే పండ్ల పెంపకం పై దృష్టిపెట్టారు రైతులు. మౌంటెన్ రోజ్ యాపిల్ కొరికి చుస్తే గులాబీ రంగులోనో ఎర్రగానో ఉంటుంది. క్యారెట్ ,బననా అయితే నారింజ రంగు గుజ్జు ఉంటుంది.ఇందులో బీటా కెరోటిన్లు వంద రెట్లు ఎక్కువ. అలాగే అనోనా రెటిక్యూ లేటా ,సీతా ఫలం మొత్తం పండు గుజ్జు రెండు ఎరుపే. మామే సపోటా లో కూడా ఎరుపు రంగు గుజ్జె.చెంబరాతి చెక్క లేదా చంద్ర హలసు పేరుతొ వుండే బ్లడ్ ఆరంజస్ ,ఆరెంజ్ గ్లో పేరుతో నారింజ పసుపు రంగుగల పుచ్చ ఇలా పండ్లే కాదు రకరకాల వాల్ నట్స్ కూడా రంగు మారిపోతున్నాయి. మరి రంగుల్లో పోషకాలుంటాయని డాక్టర్లు చెప్పేసారు కదా .
Categories
Wahrevaa

పేర్లు సేమ్ రంగే రెడ్

November 9, 2016
0 mins read
అరటి ,సీతాఫలం, పనస ,సపోటా పై తోలు ఎలాగున్నా లోపల దాదాపు తెల్లగా…
Read more
ఎప్పుడూ ఆడవాళ్ళలో ఒక ఆందోళన ..... ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో ......... ఎలా నచ్చ జెప్పాలో ఏమో ? ఇవే ప్రశ్నలు. సమాధానం లేనివి. ఇలాంటి ఆందోళనలు ఉంటె ఒంటరిగా ప్రయాణాలు చేయండి. కొద్దీ రోజులే. పర్యటనలు మనకు ఆలోచించే సమయం ఇవ్వవు . రైలో ,బస్సో ,విమానమో, దాని టైం ప్రకారం మనం పట్టుకోవాలి. కొత్త చోట మన గురించి మనం బాధ్యత తీసుకోవాలి. అలాంటప్పుడే ధైర్యం వస్తుంది. మనం కొత్త ప్రదేశంలో ఎవ్వరికీ ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వక్కరలేదు. భయపడక్కర్లేదు. ఇలాగే ఒకటి రెండు ఒంటరి ప్రయాణాలు చేయండి. అసలు మనసులో వచ్చే అనేకానేక ఆందోళనలకు, సమస్యలకు, భయాలకు జవాబులు దొరుకుతాయి అంటునాన్రు నిపుణులు. ఒక కొత్త చోటు ,కొత్త మనుషులు, కొత్త నిర్మాణాలు ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ,ఇష్టమైతే గుళ్ళు ,గోపురాలు ఏవైనా సరే వివిధ జీవనశైలులు భాషలు ఆ సమయంలో ఎదురయ్యే చిన్న ఇబ్బందులు మనల్ని దృఢంగా చేస్తాయి నిజం. ఆందోళనలు మాయం కావాలంటే స్థిరంగా ఆలోచించే ధైర్యం కావాలంటే ఒంటరి ప్రయాణాలు చేయండి.
Categories
WhatsApp

ఒంటరి ప్రయాణాలలో ఆందోళన మాయం

November 9, 2016November 9, 2016
0 mins read
ఎప్పుడూ  ఆడవాళ్ళలో ఒక ఆందోళన ..... ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో …
Read more

Posts navigation

Previous 1 … 1,170 1,171 1,172 … 1,186 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.