Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: WhatsApp

11441 Articles
కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని పక్కన పడేశారు. అని తిట్టటం లాగా అన్నమాట. కానీ నిష్టురాల సంగతి ఎలా వున్నా ప్రతీ కారపచ్చడి తాలింపులో మంచి వాసన కోసం కరివేపాకు రెబ్బలు వేసి తినేటప్పుడు తీసి పక్కన పారేస్తా. ఇక చారు కయితే కరివేపాకు తోనే అంతటి కమ్మని వాసన. ఇలా ఏరి పారేసే కరివేపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ,కాల్షియం , పాస్ఫరస్ C.A ,B,E విటమిన్లు,కార్బోహైడ్రేట్స్ ,కరివేపాకులో లభిస్తాయి. గుండె సక్రమంగా పనిచేయాలంటే కూడా కరివేపాకే ఔషధం. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కరివేపాకులో తగ్గిపోతాయి. కరివేపాకులో గోరువెచ్చని నీరు పోసి ముద్దచేసి ఆ ముద్ద ఇన్ఫెక్షన్లు ఉన్న చోట రాస్తే నిమిషాల పైన ఫలితం తెలుస్తుంది. మజ్జిగ లో మిరియాల పొడి ,ఉప్పు , కరివేపాకు కలిపి తాగితే నిజంగా అదే ఔషధం లాంటిది. ఎండా కాలం లో ఇది ప్రాణదాత లాంటిది. ఆకులే కాదు కరివేపాకు వేరు కూడా గాయాలను తగ్గించగలదు. కరివేపాకు కడిగి ఎండపెట్టి మిరపకాయలు,చింతపండు , ఉప్పు కలిపి చేసే కరివేపాకు కారంలో రోజూ ఒక్క ముద్ద అన్నం తింటే ఆరోజు తిన్న ఎక్కువైన భోజనపు బరువును తగ్గించగలదు. పిల్లలు ,పెద్దవాళ్ళు కుడా కూరల్లో వాడిన కరివేపాకు ఏరి పారేయకుండా సన్నగా తరిగి కూరల్లో వేస్తె ఎంతో ఆరోగ్యం.
Categories
Wahrevaa

రుచి దొరికాక పడేయకండి. ఇది ఔషధం

October 25, 2016
1 min read
కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి…
Read more
మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి. హెల్త్ ఫిట్ గా ఉండే ఎక్సర్సైజు లు చేయాలి. పెరఫార్మేన్స్ మెరుగుదల కోసం ముందుగా స్నాక్స్ తినాలి. ఏదీ తినకుండా వర్కవుట్స్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ముందుగా ప్రతి వర్కవుట్ తర్వాత స్ట్రెచింగ్ చేస్తే శరీరం కూలవుతుంది. కూర్చునే ఉద్యోగాల చేసేవాళ్ళు ప్రతి 30 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలి. కొన్నిసార్లు టైట్ డెడ్ లైన్స్ వుంటే అలారం గంటకోసారి ఫోన్ లో సెట్ చేస్తే వెంటనే లేచి తిరిగే అలవాటు అవుతుంది. ఇలా కొన్నాళ్ళు గంటకు సరి లేచి తిరిగే అలవాటు తో ఎనర్జీ స్థాయిలు ఎంత పెరుగుతాయో ఆశ్చర్యం వేస్తుంది కదూ. క్రమం తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. లేకపోతే నిద్రలేమి ప్రభావం శరీరం పైన వుంటుంది. అప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడో 20 నిముషాలు విశ్రాంతి తీసుకున్నా నష్టమేం లేదు. శరీరం ఆ విశ్రాంతిని అర్ధం చేసుకోగలదు. బ్రేషింగ్ తర్వాత నోరంతా నీటిని నింపుకుని కుదుపుతూ పుక్కలించటం చేస్తే నోటిలో ఉన్న చెడు బాక్టీరియా పోయి నోరు శుభ్రపడుతుంది. రాత్రి పడుకోవటానికి రెండు గంటల ముందే తినే ఆహరం ఎదో తినేయాలి. లేదా తిని తినగానే నడక చేరితే అదనపు క్యాలరీలు చేరటం లేదా క్యాలరీలు కరిగాక పోవటం జరుగుతుంది. ఆరోగ్యం కోసం సమయం లేదనవద్దు. కేటాయించి తీరాలి అంతే.
Categories
WhatsApp

షార్ట్ కట్స్ తో ఆరోగ్యం సాధ్యం

October 25, 2016
0 mins read
మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి.…
Read more
టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు చూయింగ్ గమ్స్ పెర్ఫ్యూమ్స్ వేటిలో చూసినా పుదీనా ఘుమఘుమలుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వంటకాలతో ఈ హెర్బ్ వాడతారు. కూరల పొడులు, సలాడ్లు, బిర్యానీ లు , చట్నీలు ,జెల్లీలు ,క్యాండీలు ,ఐస్ క్రీమ్ లు కూడా పుదీనా విరివిగా ఉపయోగిస్తారు. వాటర్ మింటీ ,స్పియర్ మింట్ లీ కలిపి పెప్పర్, మింట్ సృష్టించారు. ఈ హైడ్రేటెడ్ పెప్పర్ మింట్ తో అనేక ప్రయోజనాలు. ఇది బ్రిత్ ఫ్రెష్నర్. నీళ్లలో ఒక్క చుక్క పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని తాగితే అజీర్ణం ,వికారం , గ్యాస్ సమస్యలు నిమిషంలో పోతాయి. ఈ ఎసెన్షియల్ ఆయిల్ తో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలుంటాయి. మూడ్ ను అనుకూలంగా మార్చే గుణం వుంది. ఎండిన పుదీనా ఆకుల పొడితో పళ్ళు తోమితే చక్కగా తెల్లగా మెరిసిపోతాయి. సాధారణ జలుబులు తగ్గిస్తుంది. పుదీనా ఆకుల్ని ఐస్ క్యూబ్స్ గా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. లెమన్ టీ, లెమనేడ్ కోసం ఈ క్యూబ్స్ ని వాడుకోవచ్చు. ఘాటైన వసంతో మంచి ఫ్లేవర్ గల మింట్ లో ఔషధ గుణాల కోసం ఒక పుస్తకం రాయచ్చు. ఇన్ని వస్తువుల పుదీనాతో తయారై కార్పొరేట్ ప్రపంచంతో అమ్ముడుపోతున్నాయంటే పుదీనా ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవచ్చు. పుదీనా ఎస్సెన్షియల్ ఆయిల్ నుంచి తీసే మెంథాల్ ను కాస్మొటిక్స్ లో పెర్ఫ్యూమ్స్ వాడతారు.
Categories
Wahrevaa

ప్రకృతి ఇచ్చిన వరం పుదీనా

October 24, 2016
0 mins read
టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు చూయింగ్ గమ్స్ పెర్ఫ్యూమ్స్ వేటిలో…
Read more
కోపం అన్నీ అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని ఇటీవల పరిశోధనలు చెపుతున్నాయి. కోపం ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ విడుదల అవుతాయి. ఇవి పుండ్లు ,గాయాలు మానకుండా చేస్తాయట. మామూలు స్థాయి కంటే ఎక్కువ కోపం వున్నవాళ్లకే ఈ ప్రాబ్లమ్. కాలిన గాయాలతో బాధపడుతున్న 300 మందికి పైన పరిశోధనలు నిర్వహించి ఈ విషయం గుర్తించారు. వారిలో అకారణంగా ఉద్రేక పడేవారిలో గాయాలు మానేందుకు ఇరవై రోజులు సమయం పడితే శాంతంగా వుండేవాళ్ళలో నాలుగైదు రోజుల్లోనే గాయాలు మానటం ప్రారంభించాయట. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటే ఒక గాయాలే కాదు ఇంకేమన్నా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండచ్చు అంటునాన్రు పరిశోధకులు. ఈ కోపం వల్లనే నాడీ వ్యవస్థ పై శ్రీఘ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. ఈసారి కోపం వచ్చినప్పుడు గమనించండి. తీవ్రమైన కోపం వస్తే వళ్ళు వణికి పోతుంది. పల్స్ రేట్ అధికంగా వుంటుంది. కోపం కొంచెం అదుపులో ఉంచుకోవటం ఉత్తమం అంటున్నారు పరిశోధకులు.
Categories
WhatsApp

శాంతములేక సౌఖ్యము లేదు

October 24, 2016
0 mins read
కోపం అన్నీ  అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో…
Read more
మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో ఎక్కువసేపు ఏకాగ్రత తో కొనసాగించగలరని వారి జ్ఞాపకశక్తిని మెరుగ్గా వుంటుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ అధ్యయనాలు గ్రూప్ కు మైండ్ ఫుల్ మెడిటేషన్ ఎనిమిదివారాల శిక్షణ రెండో గ్రూపు కు రిలాక్సేషన్ ట్రైనింగ్ లు ఎనిమిది వారాలు మూడో గ్రూప్ కు ఏ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తూ కొన్నాళ్లు పరిశోధనలు నిర్వహించారు. వాళ్లందరికీ ఎన్నో రకాల పనులు ఇచ్చారు. ఈ మల్టీ టాస్కింగ్ వేగాన్ని ఖచ్చితంగా చేసే తీరుని సమర్ధతని నిపుణులు అంచనా వేశారు. అందరికంటే ముందు మైండ్ ఫుల్ మెడిటేషన్ ట్రైనింగ్ తీసుకున్నవారున్నారు. ఈ గ్రూప్ సభ్యులు ఎక్కువ సేపు దేని పై ధ్యానం వుంచగలిగారు . బహుళ పనులు చేయగలిగారు. బహుళ పనులు చేస్తూ ఆ వృత్తిని జయించగలిగారు. ఎలాంటి శ్రమ వత్తిడీ లేకుండా ఎంతో సమర్ధవంతంగా పనులు చేశారట. ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ చాలా అవసరం. అంచేత ధ్యానం చేయటం వాళ్ళ కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధ్యాన ఫలాలు పోందండని చెపుతున్నారు పరిశోధకులు.
Categories
WhatsApp

ధ్యానంతో మల్టీ టాస్కింగ్ సులభం

October 24, 2016October 24, 2016
0 mins read
మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో  ఎక్కువసేపు ఏకాగ్రత తో…
Read more
మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు. బచ్చల కూర లో ఇనుము నైట్రేట్ లు పుష్కలంగా వుంటాయి. ఈ కూరను వండాక మళ్ళి నేరుగా వేడి చేయకూడదు. వేడి నీళ్ళ గిన్నెలో వుంచి వేడెక్కేలా చేయాలి. అలాగే ఉడికించి లేదా కూర చేసిన గుడ్లు కూడా మళ్ళి వేడి చేస్తే అందులోని పోషకాలు పోతయి. చికెన్ కూడా అంతే, వండాక మళ్ళి మళ్ళి వేడి చేస్తే మాంసకృతులు పోతాయి సరి కదా జీర్ణ సంబందమైన సమస్యలు వస్తాయి. బంగాళా దుంప కూర కూడా వేడి చేసి తింటే విషపదార్ధాలు శరీరంలోకి చేరినట్లే. మాంసకృతులు పుష్కలంగా అందించే పుట్ట గొడుగు కూర కూడా ఫ్రిజ్ లో వుంచి, సాయంత్రం వేడి చేసి తినాలి అని చుస్తే అనారోగ్యాలు తధ్యం . సాధ్యమయినంత వండిన కూరలు మళ్ళి మళ్ళి వేడి చేసి తినడం వల్ల నష్టమే.
Categories
WhatsApp

వండినవి మళ్ళి వేడి చేస్తే నష్టం

October 22, 2016
0 mins read
మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి…
Read more
ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఎన్నో పనులు చేస్తుంటాం. సరైన పోశ్చర్ లో కనుక కూర్చోకపోతే శరీరంలో అన్ని భాగాల పైన వత్తిడి ఏపీడీ ఇతర భాగాల్లో నొప్పులు వచ్చి శరీరం అలసిపోతుంది అని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. కూర్చునే కుర్చీ లేదా డ్రైవింగ్ సీట్ లో నడుము వెనక రోల్ చేసిన టవల్ లేదా చిన్న దిండు పెట్టుకుంటే వెన్ను సమంగా ఆనుతుంది. అలాగే ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు నిఠారుగా నడుస్తూవుంటే మంచిది. హ్యాండ్ బ్యాగ్ లేదా లాప్ టాప్ బ్యాగ్ ఒకే భుజానికి తగిలించుకోకుండా రోజుకోవైపు మార్చి తగిలించుకోవాలి. అలసి పోతున్నామన్న కారణంగా వర్కవుట్స్ మానేయవద్దు. వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. ఎండార్ఫిన్లు విడుదలై మానసికమైన సంతోషం వస్తుంది. ఆరోగ్య వంతమైన అలవాట్లు మంచి నిద్ర పోషకాలు శరీరానికి తగినంత శక్తిని ఇస్తాయి. .
Categories
WhatsApp

సరైన పోశ్చర్ లో కూర్చుంటే సుఖం

October 22, 2016
0 mins read
ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఎన్నో పనులు చేస్తుంటాం. సరైన పోశ్చర్…
Read more
కర్వాచౌత్ పండుగను ఉత్తరాది చాలా ఘనంగా చేస్తుంటారు. భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవస్యం వుండి సాయంత్రం ఉపవస్య దీక్షను విరమిస్తారు.ఈ కర్వాచౌత్ పండుగ కోసం ముస్తాబైన కొందరు సెలబ్రెటీలను చుస్తే అస్సలు పండగంటే వీళ్ళే అనిపిస్తుంది. అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ కర్వాచౌత్ ఆచరించి తన బంధువులు స్నేహితుల కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పండుగలో ఎరుపురంగు చీరలో ఎర్ర గులాబీ లాగా గులాబీ రంగు డ్రెస్సు లో బిపాసాబసు, ఆఫ్ వైట్ సారీ లో మన్వతారత్, రెడ్ కలర్ చుడీదార్ లో రవీన టాండన్, పండుగాకే ఆకర్షనియంగా కనిపించరు.
Categories
WhatsApp

కర్వాచౌత్ పండుగలో సెలబ్రెటీలు

October 22, 2016
0 mins read
కర్వాచౌత్ పండుగను ఉత్తరాది చాలా ఘనంగా చేస్తుంటారు. భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా…
Read more
భారతీయ ఇంటీరియర్ డిజైన్లు ఖరీదైన టెక్సటైల్స్ ఫర్నీచర్ తో నిండివుంటాయి. కానీ వీటిలో చాలా భాగం సంప్రదాయ పద్దతిలో చేత్తో చేసినవే ఇండియన్ పర్షియన్ స్టయిల్స్ కలగలిసిన మొఘల్ పెయింటింగ్స్ అక్బర్ జహంగీర్ ల కాలం నాటివి. కానీ ఆ రిచ్ ఆర్ట్ వర్క్ వాల్ హ్యాంగింగ్స్ కుషన్లు గలీబులపై బావుంటాయి. మహారాష్ట్ర గిరిజన మహిళలు సంప్రదాయంగా సృష్టించే వార్లీ ఆర్ట్ లో జంతువులు బొమ్మలు దైనందిన జీవితానికి సంబంధించిన బొమ్మలు లూజ్ రిథమిక్ ప్యాటర్న్ తో చిత్రిస్తారు. ఈ టెర్రకోట డిజైన్స్ అద్దాలు ఇతర షోకేస్ పీస్ లతో ఇంటిని అలంకరిస్తే ఎత్నిక్ టచ్ వస్తుంది. అలాగే కుషన్లు టేబుల్ రన్నర్ మాట్స్ పైన కాపర్ వైర్డ్ గోల్డ్ ,సిల్వర్ ,పాలిష్ సిల్క్ దారాలతో చేసిన పనితనంతో జర్దోసీ జలతార్లు అద్దితే రాచరిక రూపం వస్తుంది. ఇక పార్సీ గార ఎంబ్రాయిడరీ స్టయిల్ చాలా అరుదైంది. అందమైన వర్క్. టేబుల్ క్లాత్స్ సోఫా కవర్స్ లాంప్ షేడ్స్ కు బావుంటాయి. బ్లాక్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ కు భారతదేశమే పెట్టింది పేరు. కళాత్మకమైన పువ్వులు, జియో మెట్రిక్ రకాలు ఈ డిజైన్లతో ఆధునిక పోకడలు ఫ్యాబ్రిక్ ఇంటి అలంకారణలో తిరుగు లేకుండా చేస్తారు. సంప్రదాయ పనితనంతో కూడిన పనితనానికి ఎప్పుడూ ప్రాధాన్యం వుంటుంది.
Categories
WhatsApp

ఇంటీరియర్స్ లో సంప్రదాయ డిజైన్ లే బావుంటాయి

October 22, 2016
0 mins read
భారతీయ ఇంటీరియర్ డిజైన్లు ఖరీదైన టెక్సటైల్స్ ఫర్నీచర్ తో నిండివుంటాయి. కానీ వీటిలో…
Read more
సుగంధ ద్రవ్యాలతో లవంగలది కీలక పాత్ర. లవంగం ఒక ఎండిన మొగ్గ లవంగ నూనె శక్తిమంతమైన నొప్పి నివారిణి. కండరాలు ఎముక గుజ్జు నరాల ప్లాస్మా నాడీ వ్యవస్థ పునరుత్పత్తి అవయవాల కణాల పై ప్రభావంతంగా పనిచేస్తుంది. శ్వాస ,నాడీ ,జీర్ణ వ్యవస్థ ను లవంగం టోన్ చేస్తుంది. శరీరాన్ని ఉద్వసం చేస్తుంది. నొప్పి నివారిణి గా నడుం సకృత్య సమస్య ల నివారణకు వాడదగినది. నీళ్లలో ఐదారు లవంగాలు వేసి కషాయం చేసుకుని తాగితే కఫం తగ్గుతుంది. ఉప్పు ,లవంగం కలిపి బుగ్గన పెట్టుకుంటే దగ్గు ఉపశమనం. ఎసిడిటీ వల్ల కలిగే అసౌకర్యానికి కుడా లవంగం మంచి ఉపశమనం. లవంగ పొడి తేనె లో చప్పరిస్తే వికారం వాంతులు తగ్గుతాయి. లవంగ మొగ్గలు నీటిలో వేసి మరగనిచ్చి తాగితే గర్భవతులు వికారం పోతుంది. కొబ్బరినూనెలో లవంగ నూనె కలిపి రాస్తే మొటిమలు వాటి మచ్చలు కుడా తగ్గిపోతాయి. నీళ్లలో లవంగ నూనె కలిపి స్ప్రే చేస్తే క్రిముల్ని దూరం చేసే రిపెలెంట్ గా పనిచేస్తోంది. పొడిగా నీటిలో వేసి కాచి డికాషన్ లాగా పాలతో కలిపి తీసుకున్నా లవంగాల తో జరిగే అన్నీ ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.
Categories
Wahrevaa

మేలు చేసే ఎండిన పూమొగ్గ

October 22, 2016October 22, 2016
0 mins read
సుగంధ ద్రవ్యాలతో లవంగలది కీలక పాత్ర. లవంగం ఒక ఎండిన మొగ్గ లవంగ…
Read more
Categories
Top News Wahrevaa

వృద్ధుల కోసం లైఫ్‌ సర్కిల్‌ హెల్త్‌ సర్వీసెస్‌

September 23, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-3.html
Read more
Categories
Wahrevaa

ఆరోగ్య లభాలిచ్చే నేరేడు

September 17, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-20.html
Read more

Posts navigation

Previous 1 … 952 953 954 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.