Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
సంక్రాంతి రోజులు బావుంటాయి. ఇప్పుడీ పల్లెటూరి సంక్రాంతి అందాలు సినిమాల్లో చూడాల్సిందే. అపార్ట్మెంట్ కల్చర్ తో సంక్రాంతి వేడుక ఇంకో విధంగా వుంటుందనుకోండి. గంగి రెద్దు మేళం రాదుగా సన్నాయి వాయిస్తూ ముందర ఒకడువస్తుంటే శృతిని వాయిస్తూ మద్దెలతో ఇంకొకరు వెనకగా నడుస్తూ ఉంటే ఇద్దరి మధ్యను అలంకారంతో గంగిరెద్దు. ఈ ఎద్దు ఏం చెపుతుందంటే ? ఓ యజమానీ అన్నదాతా ఆషాడంలో తొలకరి తొలిచినుకు పడిన దగ్గర నుంచి మీ ఏఇంట్లో గేదెలు నిండేవరకు చక్కని శ్రమ చేసి నిన్న ధనవంతుడిని చేసిన శ్రామికుడిని నన్ను గుర్తించు. అంటుందిట. మేత పెట్టి నీళ్లు తాగించి వీపు నిమిరితే ఆనందించే ఎద్దు అల్ప సంతోషం జీవితంలో మానసిక ఆనందాన్ని ఇస్తుందని అదే దివ్యౌషధం అని చెపుతోంది. అహంకారం లేకుండా ఆనందంగా వుండు అని చెప్పేందుకే ఈ గంగిరెద్దు సన్నాయి మేళం అంటారు పెద్దలు. మనిషి జీవితంలో కొందరికి రుణపడి ఉండాలి కొందరి రుణం తీర్చుకోవాలి.
Categories
WoW

ధనమిచ్చే శ్రామికుడు

December 27, 2016
0 mins read
సంక్రాంతి రోజులు బావుంటాయి. ఇప్పుడీ పల్లెటూరి సంక్రాంతి అందాలు సినిమాల్లో చూడాల్సిందే. అపార్ట్మెంట్…
Read more
అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది ఉంటారు. అక్కడ వస్తువులు రాళ్ళూ రత్నాలు చాక్లేట్లు తినటం తెచ్చుకోవటం గిఫ్ట్లుగా రావటం ఇంకెంతో గొప్ప అనుకునేవాళ్లు వున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా వాసులు తినేదే బలవర్ధకమైన ఆహారం మనమైతే ఎదో కాస్త వేళకి వండుకు తింటాం. అనుకునే వాళ్ళకి గోల్డ్ న్యూస్ శాక్స్ అన్న సంస్థ వేడివేడిగా వండుకుని అప్పటికప్పుడు అరిటాకులో భోంచేస్తే భారతీయ భోజనమే పోషకాలకు నిలయం అని విశ్లేషించింది. నిల్వ చేసిన ఆహారం తినే అమెరికన్ల కంటే అన్నం పచ్చడి .పప్పు పాయసం సాంబారు పెరుగు ఊరగాయల్లో ఎన్నెనో క్యాలరీలు. అత్యంత రుచీ ఉన్నాయని పరిశోధన సారాంశం. పైగా మనం తినే భోజనం ఖర్చు తక్కువదీ పోషకాలు ఎక్కవదీ అనేసింది. ఊరగాయలు అప్పడాలు వడియాలు ఒరుగులూ తప్ప మనం అప్పటికప్పుడు ఫ్రెష్ గా కూరలు కోసి వండుకుని తింటాం కనుక ఈ అలవాటే ఎంతో మంచిదనీ పోషక విలువల తో కూడి వుంటుందని తేల్చింది.
Categories
Wahrevaa

మన విస్తరి భోజనం బెస్ట్ అండ్ టేస్ట్

December 27, 2016
0 mins read
అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది…
Read more
కర్ణాటక లో ఇల్కాల్ ఎక్కడఅంటే చెప్పలేరేమో కానీ ఇల్కాల్ చీరలంటే మాత్రం చాలా పాప్యులర్. ఇల్కాల్ గ్రామం మొత్తం ఈ నేత వేయటంలో నిమగ్నమై వుంటారు. పేల్ స్టైపెడ్ పల్లు అంచుల దాకా సాగే బోర్డర్ తో కలిసిపోవడం ఇల్కాల్ చీరల స్పెషాలిటీ. ఇవి చాలా భాగం మగ్గాల పైనే నేస్తారు. సాధారణంగా చీర పమిటి కొంగు విడిగా తయారు చేసి జాయింటుచేస్తారు. ఐదు వేల పోగులతో చేత్తో ముడులు వేస్తూ కూల్ బ్రైట్ కలర్స్ తో నేశాక చీరలు కొత్త రంగు చేత్తో అద్ది ట్విస్ట్ చేస్తారు. నిండు నూలు దారాలతో రంగుల సిల్క్ లేదా రేయాన్ అంటే ఆర్ట్ సిల్క్ పోగుల్ని ఓ రోజులో అల్లిక పూర్తి చేస్తారు. కసూటి ఎంబ్రాయిడరీ అదనపు హంగుగా ఉంటుంది. శంఖు పూలు ,కలువ పూలు రధాలు ఏనుగులు దీపాలు వంటి డిజైన్స్ వేస్తారు. చీర చాలా అందంగా ఉంటుంది.
Categories
Sogasu Chuda Tarama

అందానికే అందం ఇల్కాల్ శారీస్

December 27, 2016
0 mins read
కర్ణాటక లో ఇల్కాల్ ఎక్కడఅంటే చెప్పలేరేమో కానీ  ఇల్కాల్ చీరలంటే మాత్రం చాలా…
Read more
మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు చెపుతూనే ఉంటారు. సోడియం నరాల ఇంపల్స్ ని ట్రాన్స్మిట్ చేయటానికీ మజిల్ ఫైబర్ తో కాంట్రాక్ట్ రావటానికి సాయ పడుతుంది. ఇందుకు కొద్దిపాటి ఉప్పు చాలు. అంటే రోజుకు సగం కంటే ఎక్కువ టీ స్పూన్ పరిమాణం చాలు. ఉప్పును అధికంగా వాడితే కార్డియో వాస్క్యుల్లర్ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. దైనందిన ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించి సహజ రుచిని ఇచ్చే వాటిని ప్రత్యామ్నాయం చేసుకోవాలి. స్పైస్ లు డ్రై లేదా తాజా హెర్బ్స్ వాడుతుండాలి. మిరియాలు దాల్చిన చెక్క పసుపు ఆవాలు యాలకులు తులసి ఆకులు కసూరీమేతి వంటి వాటిని వాడాలి. క్వాన్ట్ ట్రిన్స్ట్ లేదా ప్రాసెస్ ఉత్పత్తులు తగ్గించాలి. కూరగాయల్ని గ్రిల్ చేయటం రోస్ట్ చేయటం ద్వారా వాటిలోని సహజమైన తీపిని వెలికి తీయాలి. వీటికి కొద్దిపాటి ఉప్పు జతచేస్తే రుచి దక్కుతుంది. ఏ పదార్ధాలు కొని ఉడికించినా తక్కువ స్థాయిలో ఉప్పు అన్న సూత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
Categories
WhatsApp

కాస్తంత తక్కువ స్థాయిలో

December 27, 2016
0 mins read
మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు చెపుతూనే ఉంటారు.…
Read more
నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం తనను తానూ ప్రేమించే వ్యక్తి తనను తానూ ఎలా చంపుకుంటాడు ? అంటాడు జాషో. నిజమే. సకల సమస్యలకు మూలం భయం. నిరుద్యోగం ఆర్థిక సమస్య ప్రేమ వైఫల్యం విడాకులు ఆత్మీయుల మరణాలు నమ్మక ద్రోహాలు ఏదైనా కానీ. సమస్య తీవ్రత ఒక శాతం. మిగతా అంతా భయం. ఏ సమస్య పరిష్కించలేనంత క్లిష్టతరం కాదు. భయంతోనే మనిషిలో తెలివి తేటలు శక్తి సామర్ధ్యాలు మట్టికొట్టుకుపోతాయి. అప్పుడే పరిష్కారం ఒక్క బావే అన్న నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు చెప్పు ఏదీ సాధించకుండా ఏ ఒక్క మంచి పనీ చేయకుండా ఏ ఒక్క జీవితాన్ని మార్చకుండా జీవితం వద్దనుకోవటం ఎంత వరకు న్యాయం. కఠిన పరీక్షలు పెట్టినప్పుడు వైమీ అనుకోకూడదు. ట్రై మీ .... అని సవాలు స్వీకరించాలి. సర్వస్వం కోల్పోయినా భవిష్యత్తు ఒకటుంటుంది. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో నెగ్గుకొస్తేనే సమర్ధుడైన నావికుడవుతాడు. ఎత్తు పల్లాలు ఎదుర్కుంటేనే మనిషి రాటుదేలుతారు. సమస్యల్లోనే సమర్ధత బయటపడుతుంది. ఇప్పుడు చెప్పు ప్రతి మనుషులు సమస్యల్ని ఎదుర్కునే ఇన్స్టింట్ సామర్ధ్యాలు ఉంటాయి. వాటని సమర్ధవంతంగా వాడుకుంటే చావు ఆలోచనలను చావు దెబ్బ తీయచ్చు. ఏమంటారు.
Categories
Nemalika

ఎంత అందమైందీ జీవితం

December 26, 2016December 26, 2016
0 mins read
నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న…
Read more
ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ ఫ్యాషన్ ఐకాన్ గా వుంటుందిట. ఆకర్షణీయమైన ఈ రెడ్ కలర్ ఎలాంటి డిజైన్ నయినా అద్భుతంగా ఆవిష్కరిస్తుందిట. రెడ్ కార్పెట్ సెలబ్రెటీలు ఏ రంగుల్లోనే డివైన్ లుక్ లో కనిపిస్తారట. వాళ్ళ దృష్టిలో ఇదో శక్తిమంతమైన రంగు. ఇటీవలే ఒక పరిశోధనలో కూడా ఎర్రని రంగు దృఢమైన ఆల్చనాలు సామర్ధ్యంతో కూడిన సున్నితమైన మనస్సుకు సూచన అంటున్నారు. చైనాలో ఎర్రని రంగును లక్కీ కలర్ గా పరిగణిస్తారు. ఇది ఆధిక్యతను సూచించే కలర్ కూడా . ఎరుపు హార్ట్ రేట్ ను శ్వాసకు ఉద్దీప్తం చేస్తుంది. ఒత్తిడి ఫ్రేస్తేషన్ కోపం కూడా ఎక్కువ చేస్తుందీ రంగు. తమాషా ఏమిటంటే రాయబారుల్లో ఇలాంటి రంగు దుస్తులు ధరిస్తే ఇక అంతే సంగతులు. ఈ తీవ్రమైన రంగు ప్రశాంతమైన వాతావరణం ఇవ్వదంటున్నారు. సో ఇది అద్భుతమైన అందమైన రంగు. ఎర్రనీదుస్తులు ఎవరికైనా అందాన్ని ఇస్తాయి. అలాగే మనల్ని సీరియస్ గా ఉండేట్టు చేస్తాయి.
Categories
WhatsApp

ఎంత అందమో అంత డేంజర్

December 26, 2016
0 mins read
ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ…
Read more
ఒక వూరి సమస్యను గ్రంధాలయం తీర్చింది. కేవలం పుస్తకాలూ చదవటం వార్త పత్రికలు చదవటం మనుషుల అలవాట్లనే మార్చేసింది. రాజస్థాన్ లోని బిల్వాల జిల్లాలోని మారుమూల గ్రామం ధిఫరా. ఆ వూర్లో పెద్దలు పిల్లలు కూడా మద్యం తాగుతారు. S. F. D ద్వారా కమ్యూనిస్ట్ లైబ్రరీ ప్రోగ్రాం ద్వారా ఊర్లో గ్రంధాలయం వెలిసింది. ఈ S. F. D వర్క్ షాప్ ల పుణ్యమా అని పుస్తక కదా పఠనాలు నిర్వహించారు. S. F. D కార్యకర్త అతిధి ఏమంటారంటే నెమ్మదిగా గ్రామంలో చాలా మంది తీరిక సమయాన్ని గ్రంధాలయంలో గడుపుతున్నారు.దీన్ని ప్రభావంతో గ్రామస్థుల ప్రవర్తనా అలవాట్లకు సంభంధించిన మార్పు వస్తుంది. ప్రతి వాళ్ళు దృష్టిలో వుంచుకోవాలిసిన విషయం ఏమిటంటే ఒకటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎవరి శక్తి యుక్తులు వాళ్ళు తెలుసుకుని ఆ దిశగా కొత్త దారిలో పయనించటం. ముందుగా మనకు మన శరీరానికి హాని చేసే ఎలాంటి అలవాట్ల దగ్గరకు రానీయకపోవటం. ఈ ధిఫరా గ్రామం లో నడుస్తున్న S. F. D వర్క్ షాప్ ల గురించి మాట్లాడుకోవటం ఒక చిన్న ఆలోచన వూరు వూరంతటి లో మార్పు తేవటం గురించి.
Categories
WoW

చిన్ని ఆలోచన గ్రామాన్ని మార్చేసింది

December 26, 2016
1 min read
ఒక వూరి సమస్యను గ్రంధాలయం  తీర్చింది. కేవలం పుస్తకాలూ చదవటం వార్త పత్రికలు…
Read more
ఇంటి ముందు కాస్తంత చోటున్నా సరే నాలుగు కుండీలు పెట్టి తులసి మొక్కలు నాటండి. దోమల్ని పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చిన్న రిపోర్ట్ వచ్చింది. ఇరుగ్గా వుండే మూలల్లో వుండే సామాన్లు క్లియర్ చేసి నీళ్లు నిలవకుండా చేసి ఆరోగ్యానికి హాని చేయకుండా వుండే దోమల మందు వాడి ముందు అనారోగ్యాలు రాకుండా చూసుకోమంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. గత ఐదు దశాబ్దాలలో దోమల సంఖ్యా పెరగవలిసిన దానికంటే పదిరెట్లు అధికంగా పెరిగాయట. ఇటీవల అమెరికాలో డెంగ్యూ ఎల్లో ఫీవర్ , చికన్ గున్యా వంటి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా విపరీతంగా పెరగటానికి గల కారణాలు అన్వేషిస్తూ అడవులు నరికేయటంలో ఆకుపచ్చ వనాల్లో తమ జీవన చక్రాన్ని కొనసాగించే అడ్వై దోమలు నగరాలకు వలస వచేస్తున్నాయని తేలింది. దోమలు రానీయకుండా చేసే కొన్ని రకాల మొక్కలుంటాయి. అవన్నీ వెతికి పట్టుకుని ఇంటి చుట్టూ నాటుకోండి అంటున్నారు పరిశోధకులు.
Categories
Top News

అడవులు తగ్గటం వల్లే ఈ ప్రమాదం

December 26, 2016December 26, 2016
0 mins read
ఇంటి ముందు కాస్తంత చోటున్నా సరే నాలుగు కుండీలు పెట్టి తులసి మొక్కలు…
Read more
పెదవుల తడి ఆరిపోయి పగిలిపోయి ఇబ్బందిపెడితే లిప్ బామ్ లు కొంటూ ఉంటాం. కాస్త ఓపిక చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని లిప్ బామ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె బాదం నూనె రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ పావుకప్పు తాజావి లేదా డ్రై గులాబీ రేకలు ఓ ప్యాన్ లో వేసి సన్నటి సెగతో వేడి చేస్తే మిశ్రమం మౌల్డ్ అవుతుంది. దీన్ని శానిటైజ్డ్ కంటైనర్ లో పోసి ఓ గంట ఆరనిచ్చి పూరేకులు వడగట్టి బామ్ మిక్స్డ్ గా వాడుకోవచ్చు. సిట్రస్ లిప్ గ్లాస్ తయారీకైతే రెండు టేబుల్ స్పూన్ల తేనె వేడి చేసి వాక్స్ కరిగాక బౌల్ లో పోనీ ఐస్ నింపిన ట్రే లో ఉంచాలి. 10,15 చుక్కలు నిమ్మరసం వేస్తె లిప్ గ్లాస్ సిద్ధం అయిపోతుంది. దీనికి పొడిగా ఉన్న కంటైనర్ లో పోసి భద్రం చేసుకోవచ్చు.
Categories
Soyagam

సొంతంగా లిప్ బామ్స్

December 26, 2016
0 mins read
పెదవుల తడి ఆరిపోయి పగిలిపోయి ఇబ్బందిపెడితే లిప్ బామ్ లు కొంటూ ఉంటాం.…
Read more
సంక్రాంతి నెల రోజులూ పల్లెటూర్లలో హరిదాసులు ప్రత్యక్షం అయ్యేవారు. తల పైన గుమ్మడి కాయ ఆకారపు గిన్నె దాని అంచులో పువ్వులదండ నుదుట తిరునామం చేతిలో శృతి వీణ కళ్ళకి గజ్జెలు ధ్వనికి సరిపడే విధంగా ఓ చిన్న నృత్యం గానం చేస్తూ మధ్యలో గుండ్రంగా తిరుగుతుండే విధానం. ఇది హరి దాసు వేషం. తలపైన కనిపించే గుండ్రని గిన్నె భూమికి సంకేతం. దాన్ని తలపైన ధరించి కనిపించటం అనేది ఆ పాత్రలో దానంగా బియ్యం సమర్పించటం అనేక రాబోయే పంట నిమిత్తం ధాన్యాన్ని భూమిలో విత్తనాలుగా వేస్తున్నామన్న సంకేతం. కృషార్పణం అంటూ బియ్యం సమర్పిస్తే శ్రీమద్రమణ గోవిందా అంటూ హరిదాసు స్వీకరించటం ఓ శ్రీహరి ఈ గృహిణి కృతజ్ఞతా భావంతో నీ ప్రతి నిధిగా వచ్చిన నాకు బియ్యాన్ని కానుకగా ఇచ్చిందని చెప్పేందుకు సంకేతం. ఈ భూమి డయాటహో మనకిచ్చిన పంటను ఇతరులకు పంచటం అనే సామజిక విశేషాన్ని తెలియజేస్తుంది హరిదాసు రూపం. హరిదాసు పాడే ప్రభాత భక్తి గీతం ఆరోజంతా ఆ ప్రభావాన్ని మనిషిపైన ఉంచి ఎన్నో సంతోషాలు ఇచ్చి ఈ ప్రకృతి రుణాన్ని ప్రకృతి ఇచ్చిన పంటను అందరికీ పంచి ఆనందిస్తునాన్ని చెప్పటం అంటే అందరం అన్నీ పంచుకోవాలని ఏ మతమైన బోధించే ఆధ్యాత్మిక సత్యం.
Categories
WhatsApp

అందరం అన్నీ పంచుకొమ్మని చెప్పే ధర్మ సూక్ష్మం

December 26, 2016
0 mins read
సంక్రాంతి నెల రోజులూ పల్లెటూర్లలో హరిదాసులు ప్రత్యక్షం అయ్యేవారు. తల పైన గుమ్మడి…
Read more
బెంగుళూరుకు చెందిన 21 సంవత్సరాల ఐశ్వర్య స్సె కూడా ఈ సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచివేర్స్ అవార్డుకు ఎంపికైంది. తన ధైర్యం, పట్టుదల, కృషికి గానో ఈ అవార్డు లభించింది. ఈమెకు లక్ష రూపాయిల ప్రైజ్ మనీ వుంటుందీ అవార్డుకు. ఐశ్వర్యకు బైక్ రేజింగ్ ఇష్టం. రేజింగ్ కెరీర్ ప్రారంబించిన నాలుగేళ్ళలోనే పేరు మోగే రికార్డులను సొంతం చేసుకుంది. 2014లో సియట్ ఎంటీవి ది చేజ్ సిజన్ లో పాల్గొని గుజరాత్ లోని రాణి ఆఫ్ కట్ నుంచి మేఘాలయ లోని చిరపుంజి వరకు 24 రోజుల్లో దాదాపు 8500 కిలో మిటర్లు ప్రయాణం చేసి రికార్డు సృష్టించింది. 2016 లో రైడ్ ది హిమాలయలో పాల్గొన్న మొదటి యువతి ఐశ్వర్యనే. 2016 మే లో జూనియర్ రేసింగ్ సిరీస్ లో రేస్-1, రేస్-2 లో మొదటి స్థానంలో నిలిచింది.
Categories
Uncategorized

సహస క్రీడలకు అవార్డు పొందిన ఐశ్వర్య

December 26, 2016
1 min read
బెంగుళూరుకు చెందిన 21 సంవత్సరాల ఐశ్వర్య పిస్సే కూడా ఈ సంవత్సరం గ్లోబల్…
Read more
ఈ ఏడాది ఐదవ అంతర్జాతీయ కూచిపూడి డాన్స్ కన్వేన్షన్ లో భాగంగా 6117 మంది కుచిపూడి నాట్య కళాకారులు ఒకే సారి 'జయము జయము' గీతానికి నెలకొల్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం గిన్నీస్ రికార్డ్స్ ప్రతి నిధి రిషినాద్ ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి గిన్నీస్ రికార్డు అందజేసారు.
Categories
Top News

కూచిపూడి నృత్యానికి గిన్నీస్ రికార్డు

December 26, 2016
1 min read
ఈ ఏడాది ఐదవ అంతర్జాతీయ కూచిపూడి డాన్స్ కన్వేన్షన్ లో భాగంగా 6117…
Read more

Posts navigation

Previous 1 … 1,227 1,228 1,229 … 1,276 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.